చెమట చుక్కని చిందిస్తేనే - శ్రీశ్రీ


చెమట చుక్కని చిందిస్తేనే - శ్రీశ్రీ

కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…
అదీ చేతకాకపోతే, పాకుతూ పో…
అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు!

దేహానికి తప్ప దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ
అలాగే ఉండిపోతే ఎలా?

తలుచుకుంటే,
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది!
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు,
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా – ఏదీ ఆగిపోడానికి వీల్లేదు!

లే…! బయలుదేరు…!
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు!

నువ్వు పడుకునే పరుపు,
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్!

నీ అద్దం,
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో!

నీ నీడ,
నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్!

మళ్ళీ చెప్తున్నా…
కన్నీళ్ళు కారిస్తే కాదు,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని తెలుసుకో…!

కాటమరాయుడు - లాగే లాగే / Katamarayudu - Laage Laage Song Lyrics


చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్‌
గానం: నకాష్‌ అజీజ్‌

లాగే మనసు లాగే నీవైపే ననులాగేవూగే మనసు వూగే నీ కోసం తనువూగే
నీ నవ్వులోన ఉందే ఓ మైకంనీ మాటలోన ఉందే ఓ రాగం
నీ నడకలోన ఉందే ఓ తాళంచక్కర కలిపిన పెదవులతోటీ
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే
నీ కళ్లలోన ఉందే ఓ కావ్యంనీ నడుములోన ఉందే ఓ నాట్యం
నీ చుట్టూ ఉందే నా ప్రపంచంజంతర్‌ మంతర్‌ జాదూ చేసీ…
మంతరమేదో వేసీ…

లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే
ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణాం
కాబట్టే అయిపోతున్నా గాల్లో విమానం
ఏది మధ్యాహ్నం… ఏది సాయంత్రం
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగంపిల్లా.. ఓ పిల్లా..
అరె కాటమరాయుడి గుండెని ఎట్టా కాటా వేసి పట్టుకుపోయావే
లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే


ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
మనసంతా ఆడేశావే రంగేళీ హోలీ
చేతికందొచ్చీ… చేపమందిచ్చీ
వయసుకేమో నేర్పినావే కోతి కొమ్మచ్చిచిన్నారీ.. పొన్నారీ
ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేశావే

ఎక్కేశాను ఏనుగు అంబారీ
లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే… 
*********************************************************************
Movie: Katamarayudu (2017)
Music: Anup Rubens 
Singer: Nakash Aziz 
Lyrics: Bhaskarabhatla
Laage Manasu Laage Neevaipe Nanu Laage
Ooge Manasu Ooge Neekosam Thanuvooge

Nee Navvulona Undhe O Maikam
Nee Maatalona Undhe O Raagam
Nee Nadakalona Undhe O Thaalam
Chakkera Kalipina Pedhavulathoti
Ukkiri Bikkiri Chesthunnaave

Nee Kallalona Undhe O Kavyam
Nee Nadumulona Undhe O Naatyam
Nee Chuttu Undhe Na Prapancham
Janthara Manthara Jaadoo Chesi
Manthara Medho Vesi

Laage Laage O Laage Laage
Laage Laage Laage 
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe
Laage Laage Laage Nannu Laage Nee Vaipe

Laage Manasu Laage Neevaipe Nanu Laage
Ooge Ye Maathram Kudhure Undadhu

Prema Thuranam Kabatte Aipothunna
Gaallo Vimanam Yedhi Madhyanam
Yedhi Sayantram Thelanantha Matthugundhi
Kottha Udhyogam O Pilla O Pilla
Are Katamarayudi Gundeni Atta Kaata Vesi Pattukupoyave

O Laage Laage O Laage Laage Laage 
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe
Laage Laage Laage Nannu Laage
Nee Vaipe

Hey Eedocchina Seethakokai Naa Meedha Vaali
Manasantha Aadesave Rangeli Holi
Chethikandhochi Chepamandhichi
Vayasukemo Nerpinave Kothi Kommacchi

Chinnari Ponnari Aha Ippatikippudu Yem Chesave
Ekkesanu Yenugu Ambaari

O Laage Laage O Laage Laage Laage
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe 
Laage Laage Laage Nannu Laage
Nee Vaipe

Laage Manasu Laage Neevaipe Nanu Laage

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే - ఏమైంది ఈ వేళ / Emaindi eevela song Lyrics in Telugu


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే (2007)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: కుల శేఖర్
గానం: ఉదిత్ నారాయణ్

కెన్ యూ ఫీల్ హర్?
ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్?
కెన్ యూ ఫీల్ ద లవ్? యస్.

ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా..
యే శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వెయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం..

చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే..
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా…

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా..
కడలిలాగే వురకలేసా…

బాహుబలి 2 - సాహోరే బాహుబలి / Bahubali 2 - Sahore Bahubali song Lyrics in Telugu


చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
సాహిత్యం: కె.శివ శక్తి దత్త 
గానం: దలేర్ మెహింది, కీరవాణి, మౌనిమ


భళి భళి భళిరా భళి... 
సాహోరే బాహుబలి...
భళి భళి భళిరా భళి... 
సాహోరే బాహుబలి...
జయహారతి నీకే పట్టాలీ… పట్టాలి...
భువనాలన్నీ... జైకొట్టాలి... 
గగనాలే ఛత్రం పట్టాలీ...

హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...

ఆ జననీ దీక్ష అచలం... 
ఈ కొడుకే కవచం...
ఇప్పుడా అమ్మకి అమ్మ ఐనందుకా... 
పులకరించిందిగా ఈ క్షణం…
అడుగులు గుట్టల్ మిట్టల్ గమించు...
పిడికిట పిడుగుల్ పట్టి మించు...
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు... 
అవనికి స్వర్గాలే దించు...
అంత మహా బలుడైనా అమ్మ వొడి పసివాడే...
శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే...

హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స
హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...
హేయ్‌స రుద్రస్స హేయ్‌సరభద్ర సముద్రస్స...

భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి...
జయహారతి నీకే పట్టాలీ…
భళి భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి…
జయహారతి నీకే పట్టాలీ… పట్టాలి... 
భువనాలన్ని జైకొట్టాలి... గగనాలే ఛత్రం పట్టాలీ….

బాహుబలి 2 - ఒక ప్రాణమ్ / Bahubali 2 - Oka Pranam Song Lyrics in Telugu


చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
సాహిత్యం: ఎమ్ ఎమ్ కీరవాణి
గానం: కాల భైరవ


ఒక ప్రాణమ్… 
ఒక త్యాగమ్… 
తేలిపిందా.. 
తన గమ్యం… 
ఒక పాశం.. 
తన నిస్తాయి… 
రగిలిందా.. 
రణ తంత్రం… 
హరనంతోనే మొదలయ్యిందా… 
హవనంలో జ్వలనం… 
సెబాసనే నాభం... 
రారా రమ్మని 
రారా రమ్మని 
పిలిచిందా రాజ్యం...
వరించగా జయం సాంతం.. 
బలితానై ఉలి తానై.. 
మలిచేనా...
భవితవ్యం...
రుధిరంలో... 
రుణభంధం... 
ప్రతి బొట్టు... శైవం... శివమ్....

బాహుబలి 2 - దండాలయ్యా / Bahubali 2 - Dandalayya Song Lyrics in Telugu


చిత్రం: బాహుబలి 2 (2017)
సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి
సాహిత్యం: ఎమ్ ఎమ్ కీరవాణి
గానం: కాల భైరవ


పడమర కొండల్లో వాలిన సూరీడా…
పగిలిన కోటలనే వదిలిన మారేడా…
పడమర కొండల్లో వాలిన సూరీడా…
పగిలిన కోటలనే వదిలిన మారేడా…
తడిసిన కన్నుల్లో మళ్లీ ఉదయించి…
కలలో దేవుడిలా కాపై ఉంటావా…
నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం…
నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా…
దండాలయ్యా దండాలయ్యా… 
మాతోనే నువ్వుండాలయ్యా…
దండాలయ్యా దండాలయ్యా… 
మాతోనే నువ్వుండాలయ్యా…

తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటు…
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా…
తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటు…
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా…
నీ మాటే మా మాటయ్యా… 
నీ చూపే శాసనమయ్యా…
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే…
మా ఆయువు కూడా నీదయ్యా…
దండాలయ్యా దండాలయ్యా… 
మారాజై నువ్వుండాలయ్యా…
దండాలయ్యా దండాలయ్యా… 
మారాజై నువ్వుండాలయ్యా…

బాహుబలి 2 - హంస నావ / Bahubali 2 - Hamsa Naava Song Lyrics in Telugu



చిత్రం: బాహుబలి 2 (2017)

సంగీతం: ఎం ఎం కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్

గానం: సోని, దీపు


నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా...
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా...
ఓరోరి రాజా వీరాధి వీరా...
ఓరోరి రాజా వీరాధి వీరా...
నీతోనె నేను ఉండిపోనా...
ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా...
అందాక నేను కూడ రానా...
హాయైన హంస నావ లోన...
నీ గాలి సోకుతుంటె పైన...
మెచ్చిందిలే దేవసేన...
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా...
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా...

నేనే యెదపై విశాల వీర భూమిపై వసించనా...
నేనే వలపై వరాల మాలికై వాలనా...
నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా...
నిన్నే గెలిచే సుఖాల కేళిలూ తేలనా...
ఓహొహో… ఓహొహో….
ఏకాంత కాంత మందిరానా...
ఓహొహో… ఓహొహో….
నీ మోహ బాహు బంధనానా...
నూరేళ్లు బంధీని కానా...
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా...
ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాధి వీరా...
నీతోనె నేను ఉండిపోనా...
ఎందాక నువ్వు వెళ్లాలి అన్నా...
అందాక నేను కూడ రానా...
హాయైన హంస నావ లోన...
నీ గాలి సోకుతుంటె పైన...
మెచ్చిందిలే దేవసేన...
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా
నాన నాన నాన నాన నాన నాన నాన నాన నాననాననానా
నాన నాన నాన నాన నాన నాన నాన.........