చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య కుమార్
అసుర రావణాసుర... అసుర అసుర రావణాసుర...
విశ్వ విశ్వ నాయక... రాజ్య రాజ్య పాలక...
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక...
శక్తి శక్తి సూచిక... యుక్తి యుక్తి పాచిక...
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక...
ఓ.. ఏక వీర.. సూర.. క్రూర.. కుమారా...
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా...
హో.. రక్త ధార.. చోర.. ఘోర.. అఘోర...
కర్కశంగ రేగుతున్న కాల కింకర...
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...
అసుర అసుర అసుర అసుర రావణాసుర...
అసుర అసుర అసుర అసుర రావణాసుర...
చిత్ర చిత్ర హింసక.. మృత్యు మృత్యు ఘంటిక...
మృత్యుకాల ఏక కాల పలు రకాల ధ్వంశక...
ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షక...
రావణగర పట్టణాల సకల జనా ఘర్షక...
ఓ.. అంధకార.. తార.. ధీర.. సుధీర...
అందమైన రూపమున్న అతి భయంకర...
ఓ.. ధుర్వితార.. భైర.. స్వైర.. విహార...
పాపా లాగ నవ్వుతున్న ప్రళయ భీకర...
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...
నవరసాల పోషక.. నామరూప దాషక...
వికృతాల విద్యలెన్నో చదివిన వినాశక...
చరమగీత గాయక... నరకలోక నర్తక...
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక...
హో... అహంకార.. హర.. భార.. కిషోర...
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర...
హో... తిరస్కార.. ధీర.. ఏర.. కుభీర...
కణము కణము రణములైన కపాలేశ్వర...
రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...
If You Want To Latest Telugu Movie Songs Lyrics (మీకు తాజా తెలుగు సినిమా పాటల లిరిక్స్ కావాలంటే) Visit:- www.telugulyricsite.blogspot.com
ReplyDeleteNo use
ReplyDeleteHey Evvaro Telugu Song Lyrics
ReplyDeleteI’ve been looking for a site that has all my favorite Song Lyrics Telugu in one place, and I found it here! The way you’ve organized the lyrics is so helpful. Keep up the great work!
ReplyDelete