లై - బొమ్మోలే ఉన్నదిరా పోరీ | Lie - Bommole unnadira poori Bombhaat Song Lyrics in Telugu


చిత్రం: లై (2017)
సంగీతం: మణిపురి
సాహిత్యం: కాసర్ల శ్యాం
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహర

అదర నా గుండెలదర.. నిధుర కంటికి రాదు...
మధుర వెన్నెల గాసెను కదరా...
ఈ సిన్నదొస్తే పగలు వెన్నెల గాసెను గదరా...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...
ఏడికెళ్లి ఊడిపడ్డది మిస్సు... దీని నవ్వుతోనే ఎలిగిపాయే యూఎస్సు...
నడుమును జూస్తే అరేరేరే... నడుమును జూస్తే నయాగారా ఫాల్సు... 
నేను బోతా బయలెల్లిపోతా... ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోతా.. సచ్చిపోతా 
నేను బోతా బయలెల్లిపోతా... బాంచెన్ నీ కాళ్లు మొక్కి సచ్చిపోతా... సచ్చిపోతా...
ట్రంఫెటల్లె ఒంపులున్న పోరీ... ట్రంప్ లెక్క సంపుతుందిరో నారీ...
ర్యాంప్ వాక్ చేసుకుంటు గోరీ... స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారీ...

అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్లా... నీ ఒక్కపేరే కనబడ్డదే గూగుల్లా
నువ్వు ఆగి ఒళ్లు ఇరుసుకుంటే వయ్యారి పిల్లా...
నాకు బొక్కలిరినట్టుందే రెండు పక్కలా...
నువ్వు లిప్పునట్లా గొరుకుతుంటే వయ్యారి పిల్లా...
నిప్పు ఎట్లా పుట్టే తెలిసినాది నాకియ్యాల...
నీ తొవ్వకడ్డమొస్తా నేను వయ్యారి పిల్లా...
నన్ను పండవెట్టి తొక్కిపోవే చౌరస్తాలా...
సుక్కలెక్క సక్కగుంది పోరీ... దీని సెమట చుక్క సెంటు నాకు వారీ...
నన్ను గానీ ఒప్పుకుంటే గోరీ... నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా సారీ... 
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...

జస్ట్ షేక్ మీ అవుట్ ఓ హౌలే... జస్ట్ టేక్ ఏ లుక్ ఎంజాయ్ సాలే...
నీ కొంటే సూపు తాకితేనే వయ్యారి పిల్లా... మునిగి తేలినట్టుందే కాశీ గంగల...
నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్లా... సచ్చిపోయి నేను పుడతా మల్లా మల్లా...
గ్రీను సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్లా... గ్రీను కార్డు తెచ్చుకుంటానే తెల్లారికల్లా...
ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్లా... ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంట నా గుండెల్ల...
వైటు హౌసు వన్నెలున్న పోరీ... లైటు హౌస్‌లెక్క సూపరాదే దారీ...
రైటు హ్యాండ్ పట్టుకుంటే గోరీ... నీకు డిస్నీల్యాండ్ రాసిస్తా ప్యారీ...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...

1 comment: