నాన్నకు ప్రేమతో - లవ్ మి‌ ఎగైన్ / Nannaku Prematho - Love me Again Song Lyrics in Telugu


చిత్రం – నాన్నకు ప్రేమతో...(2015)
సంగీతం - దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం – చంద్రబోస్
గానం – సూరజ్ సంతోష్



నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా...
జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా...
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా...
అడుగుతున్నా నిన్నే మళ్ళీ... ప్రేమించైవా...

ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

కలలైనా కన్నీళ్లయినా...
కన్నులలో మళ్ళీ రావా...
గుబులైనా సంబరమైనా...
గుండెలలొ మళ్ళీ రాదా...
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు...
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ...
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ...
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా....

ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

మనసారా బతిమాలానే...
మన్నించవే నను తొలిసారి...
పొరపాటే జరగదు లేవే...
ప్రేమించవే రెండోసారి...
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను...
మళ్ళీ నీకె పరిచయమౌతాను...
మళ్ళీ నా మనసు నీకందిస్తాను...
అలవాటుగా నన్ను ప్రేమించవా...

ఓ..లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

అత్తారింటికి దారేది - ఆరడుగుల బుల్లెట్టు / Attarintiki Daredi - Aradugula Bullettu Song Lyrics in Telugu


సంగీతం దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం శ్రీ మణి
గానం – విజయ్ ప్రసాద్, కార్తికేయన్



గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం...
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం...
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం...
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...
భైరవడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో...
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం...
రక్షకుడో భక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో...
శత్రువంటులేని వింత యుద్దం ఇది గుండెలోతు గాయమైన శబ్దం...
నడిచొచ్చే నర్తన శౌరి హొహొ హొహొహో...
పరిగెత్తే పరాఖ్రమ శైలి హొహొ హొహొహో...
హలాహలం ధరించిన దత్తత్రేయుడో...

వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం...
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం...
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...

ధివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటి...
వినిపించని కిరణం చప్పుదు వీడు...
వడివడిగా వడగళ్ళై గడగడమని జారేటి...
కనిపించని జడివానేగా వీడు...
శంకంలో దాగేటి పొటెత్తిన సంద్రం హోరితడు...
శోకాన్నే దాటేసె అశోకుడు వీడురో...

వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...

తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ...
చిగురించిన చోటుని చూపిస్తాడు...
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ...
తన తూరుపు తరిపెవేచెస్తాడు...
రావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడో...
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో...
వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం...
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం...
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం...
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...

రఘువరన్ B Tech - అమ్మా అమ్మా / Raghauvaran B Tech - Amma Amma song lyrics in Telugu



రఘువరన్ B Tech (2015)




సంగీతం - అనిరుధ్ రవిచరన్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్ర్రీ
గానం – దీపు, ఎస్ జానకి

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా... 
నువ్వే లేక వసివాడానమ్మా...
మాటే లేకుండా నువ్వే మాయం... 
కన్నిరవుతోంది యదలో గాయం...
అయ్యో వెళ్ళిపోయావే... 
నన్నొదిలేసి ఎటు పోయావే...
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట...
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా... 
నువ్వే లేక వసివాడానమ్మా...

చెరిగింది దీపం... 
కరిగింది రూపం... 
అమ్మా నాపై ఏమంత కోపం...
కొండంత శోకం... 
నేనున్న లోకం... 
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం...
నాకే ఎందుకు శాపం... 
జన్మల గతమే చేసిన పాపం...
పగలే దిగులైన నడిరేయి ముసిరింది... 
కలవర పెడుతోంది పెను చీకటి...
ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది... 
బ్రతికి సుఖమేమిటీ...
ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా... 
నువ్వే లేక వసివాడానమ్మా...

విడలేక నిన్నూ... 
విడిపోయి వున్నా... 
కలిసే లేనా నీ శ్వాసలోన...
మరణాన్ని మరచి... 
జీవించి వున్నా... 
ఏ చోట వున్నా నీ ధ్యాసలోన...
నిజమై నే లేకున్నా... 
కన్నా నిన్నే కలగంటున్నా...
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా... 
కలతను రానీకు కన్నంచున...
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన... 
చిగురై నిను చేరనా...

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా... 
నువ్వే లేక వసివాడానమ్మా...
అడుగై నీతోనే నడిచొస్తున్నా... 
అద్దంలో నువ్వై కనిపిస్తున్నా...
అయ్యో వెళ్ళిపోయావే... 
నీలో ప్రాణం నా చిరునవ్వే...
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా...

గుణ - కమ్మనీ ఈ ప్రేమ లేఖనే / Guna - Priyathama Neevachata Song Lyrics in Telugu

గుణ (1991)



సంగీతం: ఇళయరాజా
గానం: బాలు, చిత్ర
సాహిత్యం – జాన్


కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే...

ఉహాలన్ని పాటలే కనుల తోటలో...
తొలి కలల కవితలే మాట మాటలో...

ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే...

గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే...
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే...
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు...
పువ్వు సోకి నీ సోకు కందేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది...
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది...

మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు...
అగ్ని కంటే స్వచ్ఛమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా...
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా...