జై లవ కుశ - నీ కళ్ళలోన కాటుక | Jai Lava Kusa - Nee Kallalona Song Lyrics in Telugu


చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం:  చంద్రబోస్
గానం:  హేమచంద్ర

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా...
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా...
నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా...
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...
తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా... 
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా...

నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా...
నా చెంత నువు చేరిక ఓ దారమల్లె లాగా...
నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా...
నా ప్రేమ అన్న గాలి పటం చంద్ర మండలాన్ని చేరగా...

తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా... 
అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా...

అసుర అసుర అసుర అసుర రావణసూర...

ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా...
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ...

నీ పెదవిలోన ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే...
మెడ వంపులోన నునుపు గాయానికి కారం పూస్తే...
దారుణంగా దగ్గరయి ఉదృతంగా ఉప్పెనై...
అందమైన ఔషధాన్ని తాగనా...

ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా...
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ...

అసుర అసుర అసుర అసుర రావణసూర...

జై లవ కుశ - రావణా శత్రు శాసనా | Jai Lava Kusa - Ravana Satru Sasana Song Lyrics in Telugu


చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం:  చంద్రబోస్
గానం:  దివ్య కుమార్

అసుర రావణాసుర... అసుర అసుర రావణాసుర...
విశ్వ విశ్వ నాయక... రాజ్య రాజ్య పాలక...
వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక...
శక్తి శక్తి సూచిక... యుక్తి యుక్తి పాచిక...
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక... 
ఓ.. ఏక వీర.. సూర.. క్రూర.. కుమారా...
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా...
హో.. రక్త ధార.. చోర.. ఘోర.. అఘోర...
కర్కశంగ రేగుతున్న కాల కింకర...

రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...

అసుర అసుర అసుర అసుర రావణాసుర... 
అసుర అసుర అసుర అసుర రావణాసుర... 

చిత్ర చిత్ర హింసక.. మృత్యు మృత్యు ఘంటిక...
మృత్యుకాల ఏక కాల పలు రకాల ధ్వంశక...
ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షక...
రావణగర పట్టణాల సకల జనా ఘర్షక...
ఓ.. అంధకార.. తార.. ధీర.. సుధీర...
అందమైన రూపమున్న అతి భయంకర...
ఓ.. ధుర్వితార.. భైర.. స్వైర.. విహార...
పాపా లాగ నవ్వుతున్న ప్రళయ భీకర... 

రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై... 

నవరసాల పోషక.. నామరూప దాషక...
వికృతాల విద్యలెన్నో చదివిన వినాశక...
చరమగీత గాయక... నరకలోక నర్తక...
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక...
హో... అహంకార.. హర.. భార.. కిషోర...
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర...
హో...  తిరస్కార.. ధీర.. ఏర.. కుభీర...
కణము కణము రణములైన కపాలేశ్వర... 

రావణా జై జై జై... శత్రు శాసనా జై జై జై...
రావణా జై జై జై... సింహాసనా జై జై జై...

స్పైడర్ - బూమ్ బూమ్ | Spyder - Boom Boom Song Lyrics in Telugu



చిత్రం: స్పైడర్ (2017)
సంగీతం: హరీస్ జయరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిఖిత గాంధీ

బూమ్ బూమ్ బామ్ బాబ్...బూమ్ బూమ్ బామ్ బాబ్...
భూకంపాల శబ్దమే... కుట్ర గుట్ర పుట్టేలోపే...
ఇట్టే కాదా అంతమే... గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే... 
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే...
ఎస్ పీ వై వచ్చాడోయ్... రయ్యారయి తయ్యారయి...
ఎస్ పీ వై వచ్చాడోయ్... రయ్యారయి రై రై రై...

డోరి డోరి డోంట్ యు వర్రీ...
హియర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి...
వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి...
చట్టం షర్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్త్రీ...
పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే అయి హిస్టరీ...
ఎస్ పీ వై వచ్చాడోయ్... రయ్యారయి తయ్యారయి...
ఎస్ పీ వై వచ్చాడోయ్... రయ్యారయి రై రై రై...

మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో...
హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో...
మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాసారేమో...
హాగ్‌వర్ట్స్‌లో ఈ మొనగాడు పట్టా గాని పొందాడేమో...
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని  మాసీ హీరోనే వీడు...
పంచ్ ఏది వెయ్యకుండా క్లాప్లే కొట్టిస్తాడు...
భయమును బాంబ్‌గా చేస్తాడు... హృదయం లోపల పెడతాడు...
తెలివితో అదే పనివాడు గెలుపుకి వీడే తనవాడు...
వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వేయవులే...
వీడిని అనుమతి అడగందే క్రిములిక వ్యాపించవు అసలే...
బూమ్ బూమ్ బామ్ బాబ్...బూమ్ బూమ్ బామ్ బాబ్...
భూకంపాల శబ్దమే... కుట్ర గుట్ర పుట్టేలోపే...
ఇట్టే కాదా అంతమే... గాల్లో కన్నై గస్తీ కాసే గూఢాచారి వీడులే... 
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ ఛేదిస్తాడులే...
హు ఈజ్ దట్ గాయ్?  మై మై మై...
హీ ఈజ్ ద స్పై!!! రై రై రై...

లై - బొమ్మోలే ఉన్నదిరా పోరీ | Lie - Bommole unnadira poori Bombhaat Song Lyrics in Telugu


చిత్రం: లై (2017)
సంగీతం: మణిపురి
సాహిత్యం: కాసర్ల శ్యాం
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహర

అదర నా గుండెలదర.. నిధుర కంటికి రాదు...
మధుర వెన్నెల గాసెను కదరా...
ఈ సిన్నదొస్తే పగలు వెన్నెల గాసెను గదరా...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...
ఏడికెళ్లి ఊడిపడ్డది మిస్సు... దీని నవ్వుతోనే ఎలిగిపాయే యూఎస్సు...
నడుమును జూస్తే అరేరేరే... నడుమును జూస్తే నయాగారా ఫాల్సు... 
నేను బోతా బయలెల్లిపోతా... ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోతా.. సచ్చిపోతా 
నేను బోతా బయలెల్లిపోతా... బాంచెన్ నీ కాళ్లు మొక్కి సచ్చిపోతా... సచ్చిపోతా...
ట్రంఫెటల్లె ఒంపులున్న పోరీ... ట్రంప్ లెక్క సంపుతుందిరో నారీ...
ర్యాంప్ వాక్ చేసుకుంటు గోరీ... స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారీ...

అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్లా... నీ ఒక్కపేరే కనబడ్డదే గూగుల్లా
నువ్వు ఆగి ఒళ్లు ఇరుసుకుంటే వయ్యారి పిల్లా...
నాకు బొక్కలిరినట్టుందే రెండు పక్కలా...
నువ్వు లిప్పునట్లా గొరుకుతుంటే వయ్యారి పిల్లా...
నిప్పు ఎట్లా పుట్టే తెలిసినాది నాకియ్యాల...
నీ తొవ్వకడ్డమొస్తా నేను వయ్యారి పిల్లా...
నన్ను పండవెట్టి తొక్కిపోవే చౌరస్తాలా...
సుక్కలెక్క సక్కగుంది పోరీ... దీని సెమట చుక్క సెంటు నాకు వారీ...
నన్ను గానీ ఒప్పుకుంటే గోరీ... నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా సారీ... 
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...
లడ్డోలే ఉన్నదిరా గోరీ... లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ...

జస్ట్ షేక్ మీ అవుట్ ఓ హౌలే... జస్ట్ టేక్ ఏ లుక్ ఎంజాయ్ సాలే...
నీ కొంటే సూపు తాకితేనే వయ్యారి పిల్లా... మునిగి తేలినట్టుందే కాశీ గంగల...
నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్లా... సచ్చిపోయి నేను పుడతా మల్లా మల్లా...
గ్రీను సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్లా... గ్రీను కార్డు తెచ్చుకుంటానే తెల్లారికల్లా...
ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్లా... ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంట నా గుండెల్ల...
వైటు హౌసు వన్నెలున్న పోరీ... లైటు హౌస్‌లెక్క సూపరాదే దారీ...
రైటు హ్యాండ్ పట్టుకుంటే గోరీ... నీకు డిస్నీల్యాండ్ రాసిస్తా ప్యారీ...
బొమ్మోలే ఉన్నదిరా పోరీ... బొమ్ బంభాట్ గుందిరా నారీ...

పైసా వసూల్ - కన్ను కన్నూ కలిశాయి | Paisa Vasool - Kannu Kannu Kalisayi Song Lyrics in Telugu


చిత్రం: పైసా వసూల్ (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్‌
గానం: అనూప్‌ రూబెన్స్‌, జితిన్ రాజ్, శ్రీ కావ్య చందన

కన్ను కన్నూ కలిశాయి... ఎన్నో ఎన్నో తెలిశాయి...
ఓ... కన్ను కన్నూ కలిశాయి... ఎన్నో ఎన్నో తెలిశాయి...
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం... ఇప్పుడయ్యాం కదా ఒక్కరం...
మనసు మనసు కలిశాయి... మబ్బుల్లో ఎగిరాయి...
గుర్తుండిపోదా ఈ క్షణం... 
ఓ గుండె లోతుల్లో కోలాహలం...
ఓ నువ్వు నాలో సగం.. నేను నీలో సగం...
తెచ్చి కలిపేసుకుందాం ఇలా... బాగుందే భలే గుందే...
ఇదేం సంతో తెలియనంత తమాషాగుందే బాగుందే...
కన్ను కన్నూ కలిశాయి... ఎన్నో ఎన్నో తెలిశాయి...

ఓ... ఏమో ఏమైందో... అమాంతం  ఏమైపోయిందో...
ప్రపంచం మనతో ఉండేదే.. ఎలాగ మాయం అయ్యిందో... 
నిన్నూ నన్నూగా ప్రపంచం అనుకోనుంటాది...
మనల్నీ చూస్తూ తనకే దారి లేక వెళిపోయుంటుంది... 
కాలమంతేలే ఆగదే చోటా... 
కానీ మన జంట కవ్విట్లో బంధీ లాగా ఉండిపోయిందే...
భలేగుందే...
కన్ను కన్నూ కలిశాయి... ఎన్నో ఎన్నో తెలిశాయి...
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం... ఇప్పుడయ్యాం కదా ఒక్కరం...

నువ్వే ముందుంటే కనుల్లో మేఘం మెరిసిందే...
అదేందో వెళ్లొస్తానంటే నిజంగా గుండే తడిసిందే...
నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటాది...
మరేమో దూరంగుంటే మోయలేని భారంగుంటుంది...
దీని పేరే ఏమిటంటారో...
ఏది ఏమైన ఈ హాయి చాలా చాలా చాలా బాగుందే... 
భలేగుందే...
కన్ను కన్నూ కలిశాయి... ఎన్నో ఎన్నో తెలిశాయి...
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం... ఇప్పుడయ్యాం కదా ఒక్కరం...
******************************************************************

ఫిదా - వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... | Fidaa - Vachhnde Song Lyrics in Telugu


చిత్రం: ఫిదా (2017)
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మధు ప్రియ, రాంకి

వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  

మగవాళ్ళు మస్తు చాలు... మగవాళ్ళు మస్తు చాలు... మగవాళ్ళు మస్తు చాలు...
మస్కాలు గోడతా ఉంటారే... నువ్వు వెన్నపూస లెక్క... కరిగితే అంతే సంగతే... 
ఓసారి సారీ అంటూ ఓసారి సారీ అంటూ... 
మెయింటైన్ నువ్వు చేస్తే... లైఫ్ అంతా పడుంటాడే...  
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  

ఐ బాబోయ్ ఎంత పొడుగో... ఐ బాబోయ్ ఎంత పొడుగో... ఐ బాబోయ్ ఎంత పొడుగో... 
ముద్దులెట్టా ఇచ్చుడే... తన ముందు నిచ్చెనేసి ఎక్కితే కానీ అందడే...
పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టె... 
టెక్నిక్స్ నాకున్నాయిలే... పరేషానే నీకు అక్కర్లే... 
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  
అరే ఓ పిల్లా ఇంకా నువ్వు... నేలనిడిచి గాలి మోటార్లో... 
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే... 
క్రీమ్ బిస్కట్ వేసిండే... గమ్మున కూసోనియ్యడే... 
కుదురుగా నిలుసోనియ్యడే... సన్నా సన్నగా నవ్విండే... 
కునుకే గాయబ్ జేసిండే... ముద్ద నోటికి పోకుండా... 
మస్తు డిస్టర్బ్ చేసిండే... 
హేయ్ పిల్లా రేణుకా పిల్లగాడు వచ్చిండే...
డిన్నర్ అన్నాడే... డేట్ అన్నాడే... 
వేలు పట్టి పోలు తిరిగి... నిన్ను ఉల్టా సీదా జేసిండే...  
*************************************************************

చెమట చుక్కని చిందిస్తేనే - శ్రీశ్రీ


చెమట చుక్కని చిందిస్తేనే - శ్రీశ్రీ

కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…
అదీ చేతకాకపోతే, పాకుతూ పో…
అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు!

దేహానికి తప్ప దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ
అలాగే ఉండిపోతే ఎలా?

తలుచుకుంటే,
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది!
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు,
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా – ఏదీ ఆగిపోడానికి వీల్లేదు!

లే…! బయలుదేరు…!
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు!

నువ్వు పడుకునే పరుపు,
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్!

నీ అద్దం,
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో!

నీ నీడ,
నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్!

మళ్ళీ చెప్తున్నా…
కన్నీళ్ళు కారిస్తే కాదు,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని తెలుసుకో…!

కాటమరాయుడు - లాగే లాగే / Katamarayudu - Laage Laage Song Lyrics


చిత్రం: కాటమరాయుడు (2017)
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్‌
గానం: నకాష్‌ అజీజ్‌

లాగే మనసు లాగే నీవైపే ననులాగేవూగే మనసు వూగే నీ కోసం తనువూగే
నీ నవ్వులోన ఉందే ఓ మైకంనీ మాటలోన ఉందే ఓ రాగం
నీ నడకలోన ఉందే ఓ తాళంచక్కర కలిపిన పెదవులతోటీ
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే
నీ కళ్లలోన ఉందే ఓ కావ్యంనీ నడుములోన ఉందే ఓ నాట్యం
నీ చుట్టూ ఉందే నా ప్రపంచంజంతర్‌ మంతర్‌ జాదూ చేసీ…
మంతరమేదో వేసీ…

లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే
ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణాం
కాబట్టే అయిపోతున్నా గాల్లో విమానం
ఏది మధ్యాహ్నం… ఏది సాయంత్రం
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగంపిల్లా.. ఓ పిల్లా..
అరె కాటమరాయుడి గుండెని ఎట్టా కాటా వేసి పట్టుకుపోయావే
లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే


ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
మనసంతా ఆడేశావే రంగేళీ హోలీ
చేతికందొచ్చీ… చేపమందిచ్చీ
వయసుకేమో నేర్పినావే కోతి కొమ్మచ్చిచిన్నారీ.. పొన్నారీ
ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేశావే

ఎక్కేశాను ఏనుగు అంబారీ
లాగే లాగే… లాగే లాగే… లాగే మనసు లాగే నీవైపే ననులాగే… 
*********************************************************************
Movie: Katamarayudu (2017)
Music: Anup Rubens 
Singer: Nakash Aziz 
Lyrics: Bhaskarabhatla
Laage Manasu Laage Neevaipe Nanu Laage
Ooge Manasu Ooge Neekosam Thanuvooge

Nee Navvulona Undhe O Maikam
Nee Maatalona Undhe O Raagam
Nee Nadakalona Undhe O Thaalam
Chakkera Kalipina Pedhavulathoti
Ukkiri Bikkiri Chesthunnaave

Nee Kallalona Undhe O Kavyam
Nee Nadumulona Undhe O Naatyam
Nee Chuttu Undhe Na Prapancham
Janthara Manthara Jaadoo Chesi
Manthara Medho Vesi

Laage Laage O Laage Laage
Laage Laage Laage 
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe
Laage Laage Laage Nannu Laage Nee Vaipe

Laage Manasu Laage Neevaipe Nanu Laage
Ooge Ye Maathram Kudhure Undadhu

Prema Thuranam Kabatte Aipothunna
Gaallo Vimanam Yedhi Madhyanam
Yedhi Sayantram Thelanantha Matthugundhi
Kottha Udhyogam O Pilla O Pilla
Are Katamarayudi Gundeni Atta Kaata Vesi Pattukupoyave

O Laage Laage O Laage Laage Laage 
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe
Laage Laage Laage Nannu Laage
Nee Vaipe

Hey Eedocchina Seethakokai Naa Meedha Vaali
Manasantha Aadesave Rangeli Holi
Chethikandhochi Chepamandhichi
Vayasukemo Nerpinave Kothi Kommacchi

Chinnari Ponnari Aha Ippatikippudu Yem Chesave
Ekkesanu Yenugu Ambaari

O Laage Laage O Laage Laage Laage
Manase Nee Vaipe Laage Laage Laage
Pranam Laage Nee Vaipe 
Laage Laage Laage Nannu Laage
Nee Vaipe

Laage Manasu Laage Neevaipe Nanu Laage

ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే - ఏమైంది ఈ వేళ / Emaindi eevela song Lyrics in Telugu


చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే (2007)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: కుల శేఖర్
గానం: ఉదిత్ నారాయణ్

కెన్ యూ ఫీల్ హర్?
ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్?
కెన్ యూ ఫీల్ ద లవ్? యస్.

ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా..
యే శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వెయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం..

చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే..
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా…

ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా..
కడలిలాగే వురకలేసా…