చిత్రం: ఖైదీ నంబర్ 150 (2017)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్
నీరు... నీరు... నీరు...
రైతు కంట నీరు...
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు...
ఆశలన్ని మోడు...
ఆదరించు నాథుడెవ్వరూ...
అన్నదాత గోడు నింగినంటె నేడు...
ఆలకించు వారు ఎవ్వరూ...
నీరు... నీరు... నీరు...
రైతు కంట నీరు...
చూడనైన చూడరెవ్వరూ...
గొంతు ఎండిపోయే పేగు మండిపోయే...
గంగతల్లి జాడ లేదనీ...
నీటి పైన ఆశ నీరుగారి పోయే...
రాత మారు దారి లేదని...
దాహం ఆరుతుందా...
పైరు పండుతుందా...
ధారాలైన కంటి నీటితో...
నీరు... నీరు... నీరు...
రైతు కంట నీరు...
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు...
ఆశలన్ని మోడు...
ఆదరించు నాథుడెవ్వరూ...
నేల తల్లి నేడు అంగీలారిపోయే...
మూగబోయే రైతు నాగలి...
ఆయువంతా చూడు ఆర్తనాదమాయే...
గొంతు కోసుకుంది ఆకలి...