ఇసం - నీ మనసుకి మనసే లేదులే / ISM - Nee Manasuki Manase Ledhuhle Song Lyrics in Telugu

చిత్రం: ఇసమ్ (2016)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శక్తి శ్రీ గోపాలం




నీ మనసుకి... మనసే లేదులే...
నీ మనసుకీ... మనసే లేదులే...
ఉంటే నన్నిలా వదిలీ పోదులే...
ఎలా బతికేది నేను…
గుండె నిండా నువ్వే నిండి కళ్ళముందు లేకపోతే…
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఎలా ఎలా…
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం … ప్రాణం...



నీ మనసుకి మనసే లేదులే…



మనసంతా తోలిచేసే భాద...
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత ఎంత బాగున్నో...
ఎద సడి వింటున్నావా...
వినబడి కూడా దాక్కున్నావా...
తెలియక చేస్తున్నావా...
తెలిసే చూస్తున్నావా...
చిరునవ్వులు పూసిన వాసంతాలె ఆశలు రాలే శిశిరాలవుతూంటే...



ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం… ప్రాణం...



కనిపించూ నే పోయేలోగా...
వేల వేల కళ్ళళ్లోనా వత్తులేసి నిన్ను వేటుకుతున్నాగా...
మనసుని ప్రేమగా ఇస్తే...
మనసని తెలియక విసిరేసావా...
బహుమతిగా నన్నిస్తే...
బరువని దించేశావా...
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతూంటే...



ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం… ప్రాణం... .ప్రాణం...
ఎలా ఎలా ఎలా ఎలా...
ఎలా ఎలా ఉండేడేలా ప్రాణం...

జనతాగ్యారేజ్ - ప్రణామం ప్రణామం / Janatha Garrage - Pranamam Pranamam Song Lyrics in Telugu



చిత్రం: జనతాగ్యారేజ్ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్ 



తోం.. ధిరననన ధిర ధిర న... తోం.. ధిరననన ధిర ధిర న….

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం

మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

ఎవడికి సొంతమిదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కధంతా
మన తదుపరి మిగలాలంటా
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

తోం.. ధిరననన ధిర ధిర న... తోం.. ధిరననన ధిర ధిర న….