సంగీతం – దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం – శ్రీ మణి
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం...
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం...
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం...
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...
భైరవడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో...
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం...
రక్షకుడో భక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో...
శత్రువంటులేని వింత యుద్దం ఇది గుండెలోతు గాయమైన శబ్దం...
నడిచొచ్చే నర్తన శౌరి హొహొ హొహొహో...
పరిగెత్తే పరాఖ్రమ శైలి హొహొ హొహొహో...
హలాహలం ధరించిన దత్తత్రేయుడో...
వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం...
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం...
శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...
ధివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటి...
వినిపించని కిరణం చప్పుదు వీడు...
వడివడిగా వడగళ్ళై గడగడమని జారేటి...
కనిపించని జడివానేగా వీడు...
శంకంలో దాగేటి పొటెత్తిన సంద్రం హోరితడు...
శోకాన్నే దాటేసె అశోకుడు వీడురో...
వీడు ఆరడుగుల బుల్లెట్టు...
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు...
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ...
చిగురించిన చోటుని చూపిస్తాడు...
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ...
తన తూరుపు తరిపెవేచెస్తాడు...
రావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడో...
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో...